Posts

మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్

Image
మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.ముక్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ న్సైట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని మనకు ఉపయోగపడే వెబ్ సైట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ శీర్షిక లో భాగంగా మీకు ఉపయోగపడే కొన్ని వెబ్ సైట్స్ ను తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి. www.Norse.com ఈ మధ్యకాలం లో మనం ఎక్కడ చూసిన ransomeware అనే పేరుతో హ్యాకర్స్ ఎటాక్ చేసారు అని వింటూ ఉంటాం. ఇది ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది హ్యాకర్స్ కొన్ని లక్షల హ్యాకింగ్స్ చేస్తుంటారు. మీరు వాటిని లైవ్ లో చూడాలి అనుకుంటే norse అనే వెబ్ సైట్ కు వెళ్లి live attacks అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఈ వెబ్ సైట్ లో ప్రపంచం లో ప్రతి క్షణం ఎన్ని హ్యాకింగ్స్ జరుగుతున్నాయి ఏ దేశం నుండి ఏ దేశం కు ఎటాక...

ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టెక్నాలజీ దిగ్గజం యాపిల్

Image
ప్రపంచంలో మరే కంపెనీకి లేని ఘనత ఆపిల్ ది! ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టెక్నాలజీ దిగ్గజం యాపిల్. తన ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్ని దోచుకున్న యాపిల్.. ప్రపంచంలో మరే కంపెనీ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా?. అంకెల్లో చెప్పే కంటే.. ఒక చిన్న ఉదాహరణతో దాని సత్తాను చెప్పేయొచ్చు. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సరిసమానం యాపిల్ కంపెనీ. అర్జెంటీనా.. నెదర్లాండ్స్.. స్వీడన్ లాంటి 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం ఇప్పుడా కంపెనీ. యాపిల్ ఆర్థిక బలాన్ని మన రూపాయిల్లో చెప్పుకుంటే.. అక్షరాల రూ.69లక్షల కోట్లతో సమానం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే కంపెనీ ఒకప్పుడు దివాలా కోరల్లో చిక్కుకుంది. అలాంటి కంపెనీ ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా రికార్డును సృష్టించింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ ప్రయాణాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చేసింది. యాపిల్ చరిత్రలోకి వెళితే 1976లో ఒక గ్యారేజ్ లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని షు...

ఒక్క ఫొటో మన చదువుల దుస్థితిని కళ్లకు కట్టింది

Image
టాక్ ఆఫ్ ది ఫొటో.. ఇవీ మన చదువులు.. మన చిన్నప్పుడు 6 ఏళ్ల వయసు వస్తే కానీ తల్లిదండ్రులు స్కూలుకు పంపించేవారు కాదు.. డైరెక్టుగా 1వ తరగతి నుంచే మన చదువులు మొదలయ్యాయి. ఆ సంవత్సరం తెలుగులో ‘అ - ఆ’ నేర్చుకొని కాసిన్ని పదాలు నేర్చుకోగానే 1వ తరగతి పూర్తి అయిపోయేది. మెల్లగా.. నిదానంగా నేర్చుకున్నాం.. అలా చదుకున్నవారు  రాష్ట్రపతులు - ఐటీ కంపెనీలకు అధిపతులు - పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు - ఐఏఎస్ అధికారులు అయిపోయారు.. కానీ ఇప్పుడు రెండున్నరేళ్లకే పిల్లలను స్కూలుకు పంపుతున్నాం. నర్సరీ నుంచే వారిపై మానసిక ఒత్తిడి పెంచుతున్నాం. వేలకు వేల ఫీజులను ప్రైవేటు స్కూళ్లకు దారపోస్తున్నాం.. ఎల్ కేజీ - యూకేజీ - ఆ తర్వాత 1వ తరగతి.. అంటే మూడు సంవత్సరాలు చదివితే కానీ ఒకటో తరగతి వరకూ రాని పరిస్థితి. మనం ఒకటో తరగతి కి కేవలం పలకా బలపం పట్టుకొని వెళితే ఇప్పుడు పిల్లలు బ్యాగ్ నిండా బండెడు పుస్తకాలతో  మోయలేని భారాన్ని మోస్తూ వెళుతున్నారు.. అప్పటికీ ఇప్పటికీ కాలం మారింది.. వేగం పెరిగింది.. కానీ చదువుల్లో మాత్రం మార్పులు బాగా వచ్చాయి. ఆధునిక సమాజంతో పోటీపడాలని పిల్లలను యంత్రాలుగా మారుస్తున్న...

ఈ రోజు గ్రహణంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Image
ఈ రోజు గ్రహణంలో ప్రత్యేకత ఏమిటో తెలుసా? మరో చంద్రగ్రహణం వచ్చేసింది. ఇంకో ఖగోళ అద్భుతాన్ని తీసుకురానుంది. గ్రహణం ఎప్పుడూ వచ్చినా.. ఖగోళ శాస్త్రవేత్తలకు.. పరిశోధకులకు.. పండితులకు చాలా ప్రత్యేకమే. అయితే.. మిగిలిన చంద్రగ్రహణాలకు ఈ రోజు రాత్రి చోటు చేసుకునే గ్రహణానికి ప్రత్యేకత ఒకటి ఉంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణంగా చెబుతున్నారు. మామూలుగా అయితే.. గ్రహణ సమయాలు గంట.. రెండు గంటలు ఉంటాయి. కానీ.. ఈ రోజు గ్రహణం లెక్క వేరు. వివిధ దశలు దాటే ప్రక్రియల్ని కలుపుకుంటే మొత్తం ఆరు గంటలకు పైనే ఈసారి చంద్రగ్రహణం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రోజు చంద్రగ్రహణం ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ఆవిష్కృతం కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10.44 గంటలకు మొదలై శనివారం తెల్లవారుజామున 4.58 గంటల వరకూ సాగనుంది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అంటే.. ఒంటి గంట నుంచి 2.43 గంటల మధ్య ఈ గ్రహణం ఉచ్చ దశకు చేరుకుంటుందట. ఆ సందర్భంగా చంద్రుడు ముదురు ఎరుపులో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ గా అభివర్ణిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే.. సంపూర్ణ చంద్రగ్ర...