Posts

Showing posts from August, 2018

మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్

Image
మీకు ఉపయోగపడే 5 ఇంట్రెస్టింగ్ వెబ్ సైట్స్ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.ముక్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ న్సైట్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని మనకు ఉపయోగపడే వెబ్ సైట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ శీర్షిక లో భాగంగా మీకు ఉపయోగపడే కొన్ని వెబ్ సైట్స్ ను తెలుపుతున్నాము. ఓ లుక్కేయండి. www.Norse.com ఈ మధ్యకాలం లో మనం ఎక్కడ చూసిన ransomeware అనే పేరుతో హ్యాకర్స్ ఎటాక్ చేసారు అని వింటూ ఉంటాం. ఇది ఒక్కటే కాదు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల మంది హ్యాకర్స్ కొన్ని లక్షల హ్యాకింగ్స్ చేస్తుంటారు. మీరు వాటిని లైవ్ లో చూడాలి అనుకుంటే norse అనే వెబ్ సైట్ కు వెళ్లి live attacks అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఈ వెబ్ సైట్ లో ప్రపంచం లో ప్రతి క్షణం ఎన్ని హ్యాకింగ్స్ జరుగుతున్నాయి ఏ దేశం నుండి ఏ దేశం కు ఎటాక...

ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టెక్నాలజీ దిగ్గజం యాపిల్

Image
ప్రపంచంలో మరే కంపెనీకి లేని ఘనత ఆపిల్ ది! ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది టెక్నాలజీ దిగ్గజం యాపిల్. తన ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది మనసుల్ని దోచుకున్న యాపిల్.. ప్రపంచంలో మరే కంపెనీ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ తొలి లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ ఎంతో తెలుసా?. అంకెల్లో చెప్పే కంటే.. ఒక చిన్న ఉదాహరణతో దాని సత్తాను చెప్పేయొచ్చు. మొత్తం మెక్సికో ఆర్థిక వ్యవస్థకు సరిసమానం యాపిల్ కంపెనీ. అర్జెంటీనా.. నెదర్లాండ్స్.. స్వీడన్ లాంటి 27 ప్రధాన దేశాల మొత్తం జీడీపీకి సమానం ఇప్పుడా కంపెనీ. యాపిల్ ఆర్థిక బలాన్ని మన రూపాయిల్లో చెప్పుకుంటే.. అక్షరాల రూ.69లక్షల కోట్లతో సమానం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదే కంపెనీ ఒకప్పుడు దివాలా కోరల్లో చిక్కుకుంది. అలాంటి కంపెనీ ఈ రోజున ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా రికార్డును సృష్టించింది. పర్సనల్ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ ప్రయాణాన్ని ఐఫోన్ పూర్తిగా మార్చేసింది. యాపిల్ చరిత్రలోకి వెళితే 1976లో ఒక గ్యారేజ్ లో స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీని షు...